Etela Rajender: హోం క్వారంటైన్ లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు జీపీఎస్ పద్ధతిలో ట్రాక్ చేస్తున్నాం: మంత్రి ఈటల
- రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు
- రియల్ టైమ్ లో వారు ఎక్కడ ఉన్నది గుర్తిస్తున్నాం
- కోవిడ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది
తెలంగాణ రాష్ట్రంలో హోం క్వారంటైన్ లో ఉన్న వారిని జీపీఎస్ పద్ధతిలో ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. రియల్ టైమ్ లో వారు ఎక్కడ ఉన్నది గుర్తిస్తున్నామని, కోవిడ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు వివరించారు.
‘కరోనా’ బారినపడి వైద్య చికిత్స అనంతరం దాని నుంచి కోలుకున్న ఇద్దరిని గాంధీ ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి చేశామని చెప్పారు. వాళ్లిద్దరు మరో పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ‘కరోనా’ బారిన పడి ఆరుగురు మృతి చెందారని చెప్పారు.