Sensex: సెన్సెక్స్ చరిత్రలో అతిపెద్ద త్రైమాసిక పతనం ఇదే!

Sensex witnesses biggest quarterly fall due to corona scares

  • జనవరి-మార్చి త్రైమాసికంలో 28.6 శాతం పతనమైన సెన్సెక్స్
  • నిఫ్టీ సైతం సెన్సెక్స్ బాటలోనే
  • 1992 తర్వాత దారుణ ఫలితాలు

కరోనా మహమ్మారి మనుషులనే కాదు, స్టాక్ మార్కెట్లను సైతం హడలెత్తిస్తోంది. గత కొన్నివారాల నుంచి డౌన్ ట్రెండ్ లో నడుస్తున్న మార్కెట్లు ఇప్పటికీ కోలుకోలేదు సరికదా, చరిత్రలో ఎన్నడూ చూడనంత నష్టాలు చవిచూశాయి. లక్షల కోట్లు గంటల వ్యవధిలో ఆవిరయ్యాయంటే అంతా కరోనా ప్రభావమే.

 ముఖ్యంగా, సెన్సెక్స్ ఓ త్రైమాసికంలో దారుణంగా నష్టపోవడం స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే ప్రథమం. జనవరి-మార్చి త్రైమాసికంలో సెన్సెక్స్ సూచీ 28.6 శాతం పతనమైంది. అటు, నిఫ్టీ సైతం అందుకు మినహాయింపు కాదు. 1992 తర్వాత 29.3 శాతం తగ్గుదలతో అతిపెద్ద పతనం ఎదుర్కొంది. అంతేకాదు 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 23 శాతానికి పైగా పతనంకాగా, నిఫ్టీ 26శాతం తరుగుదుల నమోదుచేసింది. ఈ దశాబ్దకాలంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇంత దయనీయ పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు.

  • Loading...

More Telugu News