Karthikeya: మొక్కుబడిగా నటించే పాయల్ ఆ ఒక్కమాటతో మారిపోయింది: దర్శకుడు అజయ్ భూపతి

RX100 Movie

  • తెలుగు హీరోయిన్లు చేయనన్నారు
  • పాయల్ ను ఒప్పించడం జరిగింది 
  •  ఆమె ఇన్వాల్వ్ కావడం వల్లనే పాత్ర పండిందన్న దర్శకుడు 

అజయ్ భూపతి దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమాను గురించి ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి మాట్లాడుతూ, "ఈ సినిమా కథ అంతా కూడా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను తెలుగు కథానాయికలలో ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించి, వాళ్లందరినీ సంప్రదించాను. కానీ వాళ్లెవరూ ఆసక్తిని చూపలేదు. దాంతో పాయల్ ను ఎంపిక చేసుకున్నాను.

కొన్ని రోజుల పాటు ఆమె కూడా ఏదో మొక్కుబడిగా షూటింగుకి వచ్చి వెళ్లేది. అది గమనించిన నేను 'ఈ సినిమాకి మీ పాత్రనే కీలకం .. మీరు ఇలా చేస్తే మీ పాత్ర చెడిపోతుంది .. యూనిట్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది' అని చెప్పాను. అప్పటి నుంచే ఆమె పాత్రలో ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టింది. ఆ కారణంగానే ఆ పాత్ర అంతగా పండింది .. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.

Karthikeya
Payal Rajputh
Ajay Bhupathi Movie
  • Loading...

More Telugu News