: చైనా ప్రధాని భారత పర్యటన విశేషాలు
మూడు రోజుల భారత పర్యటనలో చైనా ప్రధాని లీ కెకియాంగ్ రెండో రోజు బిజీబిజీగా గడిపారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన కెకియాంగ్ సాయంత్రం ప్రధానితో సమావేశమయ్యారు. ఈ రోజు మరోసారి ప్రధాని మన్మొహన్ తో హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదం, జల వివాదంతో పాటూ మరో 8 ఒప్పందాలపై సంతకాలు చేసారు. అనంతరం భేటీ విశేషాలు మీడియాతో పంచుకున్నారు. తరువాత చైనా ప్రధాని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. తరువాత లీ రాజ్ ఘాట్ లో మహాత్మునికి నివాళులర్పించారు.