Ashok Kumar: శోభన్ బాబుగారితోనే నా తొలి సినిమా చేశాను: సీనియర్ నటుడు అశోక్ కుమార్

Ashok Kumar

  • తొలి సినిమా 'పున్నమి చంద్రుడు'
  • విజయబాపినీడు గారు ఛాన్స్ ఇచ్చారు 
  • 'తెనాలి రామకృష్ణ' పేరు తెచ్చిందన్న అశోక్ కుమార్

అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై నటుడిగా అశోక్ కుమార్ కి మంచి పేరు వుంది. సుదీర్ఘ కాలంగా ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తూనే వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మొదట నేను నటనను కెరియర్ గా అనుకోలేదు .. సరదాగా నటించి చూద్దాం అన్నట్టుగా వచ్చాను. రవీంద్రనాథ్ చౌదరి గారు నన్ను తీసుకెళ్లి దర్శకుడు విజయబాపినీడు గారికి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'పున్నమి చంద్రుడు' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు.

శోభన్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాతో నా కెరియర్ మొదలైంది. ఆ తరువాత కూడా విజయబాపినీడుగారి సినిమాలనే వరుసగా చేశాను. 'ఖైదీ నెంబర్ 786' .. 'నాకూ పెళ్లాం కావాలి' .. 'మహారాజశ్రీ మాయగాడు' ఇలా వరుసగా చేసుకుంటూ వచ్చాను. గోపికృష్ణ మూవీస్ లో కృష్ణంరాజుగారి సినిమా చేస్తుండగా, 'తెనాలి రామకృష్ణ' సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సీరియల్ నాకు ఎంత పేరు తెచ్చిందో మీకు తెలిసిందే'' అని చెప్పుకొచ్చారు.

Ashok Kumar
Punnami Chandrudu Movie
Tollywood
  • Loading...

More Telugu News