Chiranjeevi: శ్రీరామ నవమి రోజున 'ఆచార్య' ఫస్టులుక్

Acharya Movie

  • కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
  • డిఫరెంట్ లుక్ తో చిరంజీవి 
  • కథానాయికగా కాజల్  

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కథనాయికగా కాజల్ నటిస్తుండగా, చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. 'ఉగాది' కానుకగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ వస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. అలా నిరీక్షించినవారికి నిరాశే ఎదురైంది.

ఈ సినిమా నుంచి 'శ్రీరామనవమి'కి ఫస్టులుక్ ను వదలాలనే ఆలోచనలో కొరటాల ఉన్నాడనేది తాజా సమాచారం. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీకి ఫస్టులుక్ ను రిలీజ్ చేసే పనిలోనే కొరటాల వున్నాడని అంటున్నారు. చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపించిన దగ్గర నుంచి, ఆయన ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Chiranjeevi
Kajal Agarwal
Charan
Koratala Siva
  • Loading...

More Telugu News