KCR: మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర, అత్యున్నత సమావేశం

kcr on corona

  • ప్రగతి భవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం భేటీ
  • అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌
  • లాక్‌డౌన్‌ వల్ల ప్రజలకు ఎదురవుతున్న పరిస్థితులపై సమీక్ష 
  • నిత్యావసరాలు అందజేతపై సూచనలు చేయనున్న కేసీఆర్ 

తెలంగాణలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు మధ్యాహ్నం తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో అత్యవసర, అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో పాటు పలు శాఖల అధికారలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.

తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు. ప్రజలకు నిత్యావసరాలు అందజేత వంటి అంశాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. పంటల కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు వంటి వాటిపై చర్చలు జరుపుతారు. కరోనా వ్యాప్తి కాకుండా ప్రజలను చైతన్యం చేసే కార్యాచరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెల్ల రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ అంశంపై కూడా ఆయన సూచనలు చేస్తారు.

  • Loading...

More Telugu News