Manchu Vishnu: 'ఓటర్' సినిమా దర్శకుడు నాపై ఎందుకలా చెప్పాడో తెలియదు: హీరో విష్ణు

Voter Movie

  • 'ఓటర్' దర్శకుడితో మాట్లాడాలనుకున్నాను 
  • నా సన్నిహితులు వారించారు 
  • అతని తరఫువారు వచ్చి మాట్లాడారన్న విష్ణు 

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు పాల్గొన్నాడు. 'ఆ మధ్య 'ఓటర్' సినిమా దర్శకుడు తన ప్రాణాలకు మీ వలన హాని ఉందని ఒక వీడియో చేసి వదిలాడు. అసలు విషయం ఏమిటి?' అనే ప్రశ్న విష్ణుకు ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ .. "ఆ దర్శకుడు ఎందుకలా చేశాడో నాకే తెలియదు. ఆయనలా ఎందుకు చేశాడో పిలిపించి మాట్లాడదామని భావించాను. కానీ నా సన్నిహితులు వారించారు.

ఆయన తాగేసి మాట్లాడాడా? సినిమా విడుదలకి ముందు ఇష్యూ చేయడానికి మాట్లాడాడా? అనేది దృష్టిలో పెట్టుకుని మౌనంగా వుండిపొమ్మన్నారు. అతని తరఫున కొందరు వచ్చి, తాగేసి ఏదో మాట్లాడాడు మీరేమీ రియాక్ట్ కాకండి అని అన్నారు. ఎప్పుడైనా కాంట్రవర్సీలను నమ్ముకుంటే సినిమా ఆడదు .. కంటెంట్ ఉంటేనే ఆడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి" అని చెప్పుకొచ్చాడు.

Manchu Vishnu
Karthik
Voter Movie
  • Loading...

More Telugu News