Rajive Gouba: ఎక్కడో తేడా కొడుతోంది... వెంటనే సెట్ చేయకుంటే ఘోర ఆపదే!: రాష్ట్రాలకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ హెచ్చరిక

Rajive Fouba Warns State Governments over Foreign Travellers

  • విదేశాల నుంచి వచ్చిన వారు లక్షల్లో ఉన్నారు
  • అందరూ నిఘా పరిధిలో ఉన్నారంటే అనుమానంగా ఉంది
  • ఫారిన్ నుంచి వచ్చిన వారిపై నిఘా పెంచాలన్న రాజీవ్ గౌబా

వివిధ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారిని మరింత నిఘాతో పర్యవేక్షించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ఈ మేరకు ఓ లేఖ రాసిన ఆయన, విదేశాల నుంచి వచ్చిన వారందరూ ఇప్పుడు నిఘాలో లేరన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు, నిఘాలో ఉన్న వారి సంఖ్యకూ తేడా ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈ కారణంతో ఘోర ఆపద ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని పరిమితం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ వ్యత్యాసం విఘాతం కలిగించేలా ఉందని హెచ్చరించిన రాజీవ్ గౌబా, వారిపై మరింత దృష్టిని సారించాలని అన్నారు. వైరస్ ను అరికట్టాలంటే, ఫారిన్ నుంచి వచ్చిన అందరినీ క్వారంటైన్ లో ఉంచాల్సిందేనని సూచించారు.

కాగా, ఇమిగ్రేషన్ విభాగం అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు అందాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలుమార్లు అప్రమత్తం చేసింది. అందరిపైనా నిఘా ఉందని అధికారులు అంటున్నా, పలువురు క్వారంటైన్ స్టాంపులతో బయట తిరుగుతూ ఉండటం, కొన్ని చోట్ల బయటకు వచ్చిన వారిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News