Pruthviraj Sukumaran: మలయాళ హిట్ మూవీ రీమేక్ లో మార్పులు

Ayyappanum Koshiyum Movie

  • మలయాళంలో హిట్ కొట్టిన సినిమా 
  •  తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  •  తెరపైకి బాలకృష్ణ - రానా పేర్లు

మలయాళంలో ఇటీవల వచ్చిన 'అయ్యప్పనుం కోశియుం' చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా, విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సన్నాహాలు చేస్తున్నాడు.

మలయాళ కథను యథాతథంగా రీమేక్ చేస్తే బోర్ కొట్టవచ్చని భావించి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కొన్ని మార్పులు చేయాలని భావించారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై దర్శకుడు వెంకీ కుడుముల కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఫ్రెండ్లీగా ఆయన ఈ ప్రాజెక్టుకు వర్క్ చేస్తున్నాడట .. అంతే. ఈ స్క్రిప్ట్ లో మార్పులు .. చేర్పుల విషయంలో త్రివిక్రమ్ పర్యవేక్షణ కూడా ఉందని అంటున్నారు. బాలకృష్ణ .. రానాలను ఒప్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

Pruthviraj Sukumaran
Biju Menon
Ayyappanum Koshiyum Movie
  • Loading...

More Telugu News