Jammu And Kashmir: రోడ్డుపైకి వస్తున్న వారి నుదిటిపై ఇలా స్టాంపులు వేస్తోన్న పోలీసులు!

JK Police stamping violators of lockdown in RS Pura

  • నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతోన్న యువకులు
  • చర్యలు తీసుకుంటున్న పోలీసులు
  • జమ్మూకశ్మీర్‌లో పలువురికి స్టాంపులు

లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ దాన్ని ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుసార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా పోలీసులకు చాలా మంది విసుగు తెప్పిస్తుండడంతో వారి ముఖాలపై స్టాంపులు వేస్తున్నారు. రహదారులపైకి వచ్చిన కొందరికి జమ్మూ కశ్మీర్‌లోని రణ్‌బీర్‌ సింగ్ పురా పోలీసులు నుదిటిపై స్టాంపులు వేశారు.
                      
ఈ స్టాంపులు 15 రోజుల పాటు ఉంటాయి. కొందరికి చేతులపై కూడా ఈ స్టాంపులు వేస్తున్నారు. 'క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించాడు' అని ఆ స్టాంపులపై రాసి ఉంది. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పేరు కూడా రాసి ఉంది. దీంతో ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పోలీసులు కూడా ఇదే తీరుతో ఉల్లంఘనదారులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన వారికి కూడా స్టాంపులు వేస్తోన్న విషయం తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News