Rashmika Mandanna: 'జెర్సీ' రీమేక్ ను అందుకే ఒప్పుకోలేదు: హీరోయిన్ రష్మిక

Jersey Hindi Movie

  • 'జెర్సీ' హిందీ రీమేక్ కోసం అడిగారు 
  • నిజానికి అది చాలా మంచి సినిమా
  • రియలిస్టిక్ సినిమాలు చేయదలచుకోలేదన్న రష్మిక  

తెలుగులో స్టార్ హీరోయిన్ గా రష్మిక దూసుకుపోతోంది. వరుసగా ఆమె ఖాతాలో విజయాలు నమోదవుతూ ఉండటంతో, వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే తన సక్సెస్ రేట్ ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే హిందీ రీమేక్ 'జెర్సీ'లో ఛాన్స్ ను వదులుకుంది.

ఈ విషయం గురించి రష్మిక మాట్లాడుతూ, "హిందీ 'జెర్సీ'లో చేయమని అడిగారు .. కానీ నేను అంగీకరించలేదు. 'జెర్సీ' మంచి సినిమా కాదని కాదు .. అది రియలిస్టిక్ మూవీ. ప్రస్తుతానికి నేను ఈ తరహా సినిమాలు చేయదలచుకోలేదు. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందువల్లనే 'జెర్సీ' హిందీ రీమేక్ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాను" అని చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna
Jersey Movie Remake
Tollywood
  • Loading...

More Telugu News