Anupama Parameswaran: కరోనాపై పోరు ఇలాగేనా?.. పౌరుల తీరుపై సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఆగ్రహం

Actress Anupama Parameswaran fires on people

  • ఏంటిది?.. చెత్తకుండీలు ఉన్నాయిగా
  • వాడి రోడ్డుపై పారేయడం సరికాదు
  • రోడ్డుపై కనిపించిన వాటిని తాకొద్దు

కరోనా వైరస్‌ విస్తృతికి ఓ వైపు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంటే మరోవైపు ప్రజలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటూ నటి అనుపమ పరమేశ్వరన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగిస్తున్న మాస్కులను ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారని, ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరించింది.  ఈ మేరకు విసిరిపారేసిన మాస్కుల ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

మనం కరోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. వాడి పారేసిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో వేయాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి మాస్కులు కనిపిస్తే తాకొద్దు, వాడొద్దని సూచించింది. తన డాక్టర్ ఫ్రెండ్‌కు ఐసోలేషన్ వార్డుకు వెళ్లే దారిలో ఇవన్నీ కనిపించాయని అనుపమ పేర్కొంది.

Anupama Parameswaran
Actress
Corona Virus
Face masks
  • Loading...

More Telugu News