Corona Virus: కరోనా కట్టడిపై సీఎస్, డీజీపీతో జగన్ సమీక్ష.. ఆసుపత్రుల్లో సదుపాయలు పెంచాలని ఆదేశం
- కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్ష
- వైరస్ ప్రభావిత ప్రాంతాలను నిరోధక ద్రావణాలతో శుభ్రపరచాలని ఆదేశం
- రేపటికల్లా ఇంటింటి సర్వేను పూర్తి చేయాలన్న సీఎం
కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కరోనా నిరోధక బృందంతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ నిరోధక ద్రావణాలతో శుభ్ర పరచాలని ఆదేశించారు. రేపటికల్లా ఇంటింటి సర్వేను పూర్తి చేయాలని, ఇందుకోసం గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశ వర్కర్ల సాయం తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి ఐసోలేషన్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, ఆయా వ్యక్తుల ఇళ్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా వారితో చర్చించారు.