Nitin: సీఎం కేసీఆర్ కు విరాళం చెక్ ను అందజేసిన హీరో నితిన్

Hero Nitin meets Cm KCR

  • ‘కరోనా’పై పోరాటానికి సీఎం సహాయనిధికి విరాళాలు
  • సత్య నాదెళ్ల భార్య తరఫును చెక్ అందజేసిన ఆమె తండ్రి 
  • ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కూడా

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నియంత్రణకు తన వంతు భాగస్వామ్యం కింద ఆయా రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళంగా హీరో నితిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో నితిన్ కలిశాడు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద పది లక్షల రూపాయల చెక్ ను ఆయనకు అందజేశాడు. ఇంకా, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసిన వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్ధాంగి అనుపమ ప్రకటించిన రూ.2 కోట్ల విరాళాన్ని ఆమె తండ్రి విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్, ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కారెం రవీందర్ రెడ్డి, మమత ఉన్నారు. ఉద్యోగులు, టీచర్ల ఒక రోజు బేసిక్ శాలరీని విరాళం కింద ఇచ్చారు. విరాళాలు అందజేసిన వారికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు.

Nitin
Hero
KCR
TRS
Telangana
Corona Virus
cm relief fund
  • Error fetching data: Network response was not ok

More Telugu News