Sivajiraja: సొంత పొలంలో పండించిన కూరగాయలను పేద కళాకారులకు అందిస్తున్న శివాజీరాజా

Actor Sivajiraja donates vegetables to poor artists

  • హైదరాబాదులో కరోనా లాక్ డౌన్
  • పేద సినీ కళాకారుల పట్ల శివాజీరాజా సానుభూతి
  • స్టే హోం చాలెంజ్ లో భాగంగా సన్నిహితులకు సవాల్

కరోనా నివారణ చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు శివాజీరాజా తన సొంత పొలంలో పండించిన కూరగాయలను పేద కళాకారులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. శివాజీరాజాకు హైదరాబాదు శివార్లలోని మొయినాబాద్ లో వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో రకరకాల కూరగాయలను, ఆకుకూరలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. చిత్ర పరిశ్రమ స్తంభించిపోవడంతో  శివాజీరాజా తన ఫార్మ్ హౌస్ లోనే కాలం గడుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన తన పొలంలోని కూరగాయలను పేద కళాకారులకు పంపిస్తున్నారు.  అంతేకాదు, స్టే హోం చాలెంజ్ లో భాగంగా తన మిత్రులు హీరో శ్రీకాంత్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, ఉత్తేజ్, దర్శకుడు కృష్ణవంశీలకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ, అవసరమైన వారికి బియ్యం, పప్పు తదితర నిత్యావసర సరుకులను కూడా పంపిస్తానని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తనకు సమాచారం అందించాలని సూచించారు.

  • Loading...

More Telugu News