Kerala: కరోనా భయంతో రాష్ట్రాన్నే వదిలి వెళ్లిపోతే... కోటి రూపాయల లాటరీ తగిలింది!

One Crore Kerala Lottery for West Bengal Youth
  • కేరళలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్ వాసి
  • లాటరీ కొనుక్కుని, స్వగ్రామానికి
  • బహుమతి రావడంతో ఆనందం
కరోనా భయం వెన్నాడుతున్న వేళ, తానున్న నగరం నుంచి రాష్ట్రంకాని రాష్ట్రంలో ఉన్న తన స్వగ్రామానికి వెళ్లిన ఓ యువకుడిని ధనలక్ష్మి వరించింది. ఈ ఘటన కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ కు వెళ్లిన ఇజారుల్ అనే వ్యక్తి జీవితంలో కొత్త వెలుగులు తెచ్చింది. వివరాల్లోకి వెళితే, వెస్ట్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన ఇజారుల్ కేరళలో ఉద్యోగం నిమిత్తం ఉన్నాడు.

ఇటీవలి కాలంలో కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. కేరళలో ఉన్న సమయంలో ఇజారుల్ కొన్న ఓ లాటరీ టికెట్ కు కోటి రూపాయల బంపర్ బహుమతి తగిలింది. ఈ విషయం అతనికి గ్రామానికి వెళ్లిన తరువాతే తెలిసిందే. దీంతో తన జీవితమే మారిపోయిందన్న ఆనందంలో ఉన్నాడు అతను. తాను గ్రామానికి వచ్చిన సమయంలో భవిష్యత్తులో ఎంతో ఆందోళన ఉండేదని, కానీ లాటరీ వచ్చిందన్న విషయం తెలిసిన తరువాత చాలా సంతోషంగా ఉందని సంబరంగా చెబుతున్నాడు.
Kerala
Lottery
Izarul
West Bengal

More Telugu News