: మోడీపై పవార్ 'పంచ్'లు
ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసుపై ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ మోడీపై తీవ్రవిమర్శలు చేసారు. అమాయక జహాన్ పై తీవ్రవాది ముద్ర వేసి ఆమెను గుజరాత్ పోలీసులు చంపేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తమ పోలీసులు ఏదో ఘనత సాధించినట్టు గర్వంగా ప్రకటించుకున్నారని మండిపడ్డారు.