Corona Virus: స్పెయిన్ లో దయనీయం... కటికనేలపై కరోనా రోగులు!

Spain faces worse situation

  • స్పెయిన్ లో కరోనా విజృంభణ
  • తాజాగా 462 మరణాలు
  • మాడ్రిడ్ లో కరోనా రోగులు కిక్కిరిసిపోయిన ఆసుపత్రులు

ఇటలీ, చైనా తర్వాత అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. రెండు వేలకు పైగా మరణాలతో స్పెయిన్ లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా 462 మరణాలు సంభవించగా, మొత్తం మృతుల సంఖ్య 2,182కి చేరింది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 33 వేలకు పైబడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక రాజధాని మాడ్రిడ్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిపోయాయి. వార్డులు నిండిపోవడంతో కారిడార్ లోనే నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మాడ్రిడ్ లో ఏ ఆసుపత్రి చూసినా ఇదే పరిస్థితి నెలకొంది.

Corona Virus
Spain
Madrid
Hospitals
  • Loading...

More Telugu News