Surya: దక్షిణాది సినీ కార్మికులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన హీరో సూర్య కుటుంబం

Hero Surya family donates ten lakhs to FEFSI

  • దేశంలో కరోనా ఉద్ధృతి
  • నిలిచిపోయిన షూటింగులు
  • ఉపాధిలేక అల్లాడుతున్న సినీ కార్మికులు

కరోనా వైరస్ భూతం ధాటికి దేశంలో అనేక వ్యవస్థలు నిలిచిపోయాయి. సినీ పరిశ్రమ సైతం కరోనా వ్యాప్తి నివారణ కోసం షూటింగ్ లకు విరామం ప్రకటించింది. అయితే పెద్ద సంఖ్యలో సినీ కార్మికులకు ఈ నిర్ణయం విఘాతంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కార్మికులకు షూటింగులు లేకపోవడంతో ఉపాధి కరవైంది.

ఈ నేపథ్యంలో దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం 'ఫెఫ్సీ'కి హీరో సూర్య కుటుంబం విరాళం ప్రకటించింది. సూర్య, ఆయన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ సినీ కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ రూ.10 లక్షల విరాళం అందించాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ మూతపడడంతో ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం ఈ విరాళం అందిస్తున్నట్టు తెలిపారు.

Surya
Karthy
Sivakumar
FEFSI
Lockdown
India
Shootings
  • Loading...

More Telugu News