Hand Sanitiser: శానిటైజర్ల ధరలను భారీగా తగ్గించిన హిమాలయ, ఐటీసీ, డాబర్, హెచ్యూఎల్!

Hans Sanitiser Price Slash by FMVG Companies

  • 200 ఎంఎల్ ధర గరిష్ఠంగా రూ. 100
  • జూన్ 30 వరకూ అమలులో
  • ఉత్పత్తిని పెంచిన కంపెనీలు

జూన్ 30 వరకూ హ్యాండ్ శానిటైజర్ల ధరలను తగ్గించాలని నిర్ణయించినట్టు పలు కంపెనీలు స్పష్టం చేశాయి. 200 ఎంఎల్ శానిటైజర్ ధరను గరిష్ఠంగా రూ. 100కు పరిమితం చేస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ధరలను తగ్గించి, ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించామని హిందుస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ, డాబర్, హిమాలయ, గోద్రేజ్ తదితర ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. శానిటైజర్లకు గిరాకీ పెరిగినందున ఉత్పత్తిని కూడా పెంచామని వెల్లడించాయి. తాము సూచించిన ధరకే రిటైల్ అమ్మకాలు సాగించాలని దుకాణదారులను కోరినట్టు పేర్కొన్నాయి.

Hand Sanitiser
FMCG Companies
Price Slash
  • Loading...

More Telugu News