Karan Johar: కరణ్ జొహార్ కి కోపం తెప్పించిన కైరా!

Mister Lele Movie

  • 'లస్ట్ స్టోరీస్' తో పెరిగిన క్రేజ్ 
  • 'మిస్టర్ లెలె' కోసం అడిగిన కరణ్ 
  • సున్నితంగా తిరస్కరించిన కైరా

బాలీవుడ్ బడా నిర్మాతగా కరణ్ జొహార్ కి మంచి పేరు వుంది. ఆయన ప్రొడక్షన్లో నిర్మితమయ్యే సినిమాల్లో చేయాలని నటీనటులు ఆసక్తిని చూపుతుంటారు. అలాంటిది కైరా అద్వాని మాత్రం ఆయన ప్రాజెక్టులో చేయడం కుదరదని చెప్పిందట. గతంలో కరణ్ జొహార్ నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' ద్వారా కైరా అద్వానీకి మంచి గుర్తింపు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన 'లస్ట్ స్టోరీస్' ఆమె క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి. ఆ తరువాత ఆమె కెరియర్ ను పరుగులు పెట్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ తన సొంత బ్యానర్లో 'మిస్టర్ లెలె' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా చేయమని అడగగా, డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. తనకి లైఫ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆమె మరిచిపోయి, అలా వ్యవహరించడం పట్ల కరణ్ జొహార్ కోపంగా వున్నాడని అంటున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Karan Johar
Kira Advani
Mister Lele Movie
  • Loading...

More Telugu News