: 'నేటికీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు'


ముస్లింలను ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ముస్లిం ఫోరం ఫర్ పోలిటికల్ అఫైర్స్ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ముస్లింలు ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురౌతూనే ఉన్నారని ఫోరం ఆరోపించింది. తమకు రావాల్సి రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందజేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరిపి తమ వర్గ నేతలకు సరైన హోదా కల్పించే విధంగా ఫోరం కృషి చేస్తుందని ఫోరం కన్వీనర్ నయీముల్లా షరీఫ్ తెలిపారు.

  • Loading...

More Telugu News