Chiranjeevi: 'ఆచార్య' కోసం చరణ్ కి రోజుకి కోటి?

Acharya Movie

  • కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
  • ముఖ్యమైన పాత్రలో చరణ్ 
  • మెగా అభిమానులందరి దృష్టి ఈ సినిమాపైనే 

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు జరుగుతోంది. మ్యాట్నీ ఎంటెర్టైన్మెట్స్ వారితో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు చరణ్ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెరపైకి మహేశ్ బాబు పేరు వచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్ బాబుకి రోజుకి కోటి రూపాయలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు వార్తలు షికారు చేశాయి. అయితే మళ్లీ సీన్లోకి చరణ్ వచ్చాడు  .. కానీ డీల్ మారలేదు. ఎన్ని రోజులు షూటింగులో చరణ్ పాల్గొంటే అన్ని కోట్లు ఇచ్చేలా మాట్లాడుకున్నారట. ఇక చిరంజీవికి పారితోషికంతో పాటు, లాభాల్లో వాటా కూడా ముట్టనుందని చెబుతున్నారు. మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే వుంది.

Chiranjeevi
Charan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News