Tirumala: తిరుమలలో తీవ్ర అస్వస్థతకు గురైన భక్తుడు... కరోనా భయం!

Maharashtra pilgrim hospitalized in Tirumala

  • శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుడికి తీవ్ర జ్వరం, జలుబు
  • తిరుమల ఆసుపత్రిలో చికిత్స
  • వారణాసి నుంచి తిరుమల వచ్చిన మహారాష్ట్ర వ్యక్తి

దేశంలో ప్రతిచోటా కరోనా మహమ్మారి గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా అనేక ప్రాంతాలకు విస్తరిస్తుండడమే అందుకు కారణం. దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా, తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి.

శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు వారణాసిని సందర్శించిన అనంతరం తిరుమల వచ్చాడు. ప్రస్తుతం అతడు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆ భక్తుడిని తిరుమలలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు, తిరుపతి అలిపిరి వద్ద చెక్ పోస్టును మూసివేసి, తిరుమలకు వాహనాలను నిషేధించినట్టు తెలుస్తోంది. చెక్ పోస్టు మూసివేతతో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News