Regina Cassandra: ఒక్కరు నెగెటివ్ కామెంట్ చేసినా నీరుగారిపోతాను: హీరోయిన్ రెజీనా

Actress Regina

  • సోషల్ మీడియా అంటే ద్వేషం లేదు 
  •  అవసరమైనంత వరకే ఉపయోగిస్తాను 
  •  ప్రైవసీని కోరుకుంటానన్న రెజీనా   

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో హీరోయిన్లలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటున్నారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను .. సినిమాలకి సంబంధించిన వివరాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే తను మాత్రం సోషల్ మీడియాకి కాస్త దూరంగానే ఉంటానంటూ రెజీనా చెప్పుకొచ్చింది.

 "సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై నాకు ఎలాంటి ద్వేషం లేదు. అవసరం ఉన్నంత మేరకే నేను వాటిని ఉపయోగించుకుంటూ వుంటాను. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరవ్వాలని నాకూ ఉంటుంది. కానీ కొంతమంది స్పందించే తీరు మనసుకి బాధ కలిగిస్తూ ఉంటుంది. పదివేల మంది పాజిటివ్ గా స్పందించి ఒక్కరు నెగెటివ్ గా కామెంట్ చేసినా నేను తట్టుకోలేను. అందుకే ఆచి తూచి పోస్టులు పెడుతుంటాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినంత వరకూ ప్రైవసీని కోరుకుంటాను" అని చెప్పుకొచ్చింది.

Regina Cassandra
Actress
Tollywood
  • Loading...

More Telugu News