Telangana: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వడగండ్ల వానకు అవకాశం: హెచ్చరించిన వాతావరణ శాఖ

Rain Allert for Telugu States

  • ఉత్తర కోస్తా, ఒడిశాపై ఉపరితల ఆవర్తనం
  • తమిళనాడు నుంచి విదర్భ వరకూ ద్రోణి
  • కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు వడగండ్ల వానకు అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

 ఉత్తర కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం, దీనికి తోడు తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా తూర్పు విదర్భ వరకూ 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఇందుకు కారణమని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కాగా, నిన్న కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.

  • Loading...

More Telugu News