Nara Lokesh: పరిటాల శ్రీరామ్​ పోస్ట్ పై కామెంట్ .. ఎదిరించి నిలిచిన వాడే నాయకుడవుతాడన్న నారా లోకేశ్​!

Nara Lokesh references Paritala sriram tweet
  • పరిటాల కుటుంబం పార్టీ మారుతోందంటూ దుష్ప్రచారం
  • దీనిపై పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ పోస్ట్
  • ఈ పోస్ట్ ను తన ఖాతాలో జతపరిచిన లోకేశ్
టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన ఓ ట్వీట్ గురించి నారా లోకేశ్ ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని పరిటాల కుటుంబీకులు వీడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను పరిటాల శ్రీరామ్ ఖండించడాన్ని ఉద్దేశించి లోకేశ్ ఓ పోస్ట్ చేశారు.

‘ఎదిరించి నిలిచిన వాడే నాయకుడు అవుతాడు’ అని ఆ  పోస్ట్ లో పేర్కొన్నారు. పరిటాల శ్రీరామ్ చేసిన పోస్ట్ ను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో జతపరిచారు. తన తండ్రి పరిటాల రవీంద్ర ఆశయ సాధన కోసం టీడీపీని బలంగా నమ్మి నిత్యం ప్రజాసేవలో కొనసాగుతున్నామని, కన్నతల్లి లాంటి టీడీపీని తాము వీడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నీతిమాలిన రాతలు మానుకోవాలని శ్రీరామ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Nara Lokesh
Telugudesam
Paritala Sriram

More Telugu News