Indian Railways: ‘కరోనా’ ఎఫెక్ట్.. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ల ధర భారీగా పెంపు
- ‘కరోనా’ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ లపై రద్దీ తగ్గించాలని నిర్ణయం
- ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ.10 నుంచి రూ.50కి పెంపు
- దేశంలోని 250 రైల్వేస్టేషన్లకు పెంచిన ధర వర్తింపు
దేశంలో ‘కరోనా’ ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే ప్లాట్ ఫామ్ లపై రద్దీని తగ్గించాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను భారీగా పెంచింది. రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్టు రైల్వేశాఖ ఓ ప్రకటన చేసింది. దేశంలోని 250 రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ టికెట్ ధరలే అమలులో ఉంటాయని తెలిపింది. ‘కరోనా’ ప్రభావం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు.