Murali Mohan: నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు అందుకే చేయలేదు: మురళీమోహన్

Murali Mohan Movie

  • మొదటి నుంచి సాఫ్ట్ కేరక్టర్స్ చేశాను 
  • విలన్ పాత్రలను చేయాలనుండేది 
  •  ఆ రోజే ఆ నిర్ణయం తీసుకున్నానన్న మురళీమోహన్  

కథానాయకుడిగా .. నిర్మాతగా మురళీమోహన్ కి మంచి పేరు వుంది. నిన్నటితరం కథానాయకుడిగా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించారు. కేరక్టర్ ఆర్టిస్ట్ గాను విభిన్నమైన పాత్రలలో మెప్పిస్తూ వస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను సాఫ్ట్ కేరక్టర్స్ చేస్తూ వచ్చాను. అందువలన విలన్ తరహా పాత్రలు చేయాలనే ఆసక్తి ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే శారదగారు కథానాయికగా చేసిన ఓ సినిమాలో నేను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేశాను. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత కలిసొస్తుందని ఆలోచించే పాత్ర అది. ఆ సినిమా పరాజయం పాలైంది. మురళీమోహన్ ని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చూడలేకపోయాము అనే స్పందన ఆడియన్స్ నుంచి వచ్చింది. దాంతో ఇకపై నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయకూడదని ఆ రోజునే నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చారు.

Murali Mohan
Sharada
Tollywood
  • Loading...

More Telugu News