Gold: యూఎస్ ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో భగ్గుమన్న బంగారం ధర!

Gold Price Soars as US Fed Cuts Interest Rate

  • వడ్డీ రేట్లను సున్నా శాతం చేసిన యూఎస్ ఫెడ్
  • పెట్టుబడులకు బంగారం బెస్టని భావిస్తున్న ఇన్వెస్టర్లు
  • రూ. 41 వేలను దాటిన పది గ్రాముల ధర

ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 వైరస్ నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడాలన్న లక్ష్యంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం బంగారం ధరను భారీగా పెరిగేలే చేసింది. వడ్డీ రెట్లు సున్నా శాతానికి చేరడంతో, బులియన్ మార్కెట్ లో పెట్టుబడి పెడితేనే, రాబడి వుంటుందని ఇన్వెస్టర్లు భావించడంతో, ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది.

భారత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఈ ఉదయం పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 700 పెరిగి రూ. 41 వేలను దాటింది. ఇటీవలి కాలంలో రూ. 44 వేలకు చేరిన బంగారం ధర, ఆపై కరోనా భయం, మార్కెట్ పతనం తదితరాల కారణంగా 40 వేలకు తగ్గిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 338 పెరిగి రూ. 40,825కు చేరింది. ఫెడ్ నిర్ణయం ప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉండటంతో, బంగారం ధర ఇంకా పెరగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News