Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ఫ్రీ: కేంద్రం

Health ministry says first two corona tests free

  • కరోనాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న కేంద్రం
  • తొలి రెండు పరీక్షలు ఉచితమన్న ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • కరోనా లక్షణాలే లేనివారికి పరీక్షలు జరుపబోమని స్పష్టీకరణ

చైనాలో మొదలైన కరోనా బీభత్సం క్రమంగా ఇతర దేశాలకు పాకింది. యూరప్ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా ప్రభావం స్వల్పంగా ఉందనే చెప్పాలి. అయితే, కరోనాను తేలిగ్గా తీసుకోరాదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలపై ఆసక్తికర విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ల్యాబ్ ల్లో మొదటి రెండు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ప్రకటించింది.

దేశంలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సాధన సంపత్తి భారత్ వద్ద ఉందని, అయితే మన వద్ద ఉన్న వనరుల్లో ఉపయోగిస్తున్నది 10 శాతం మాత్రమేని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవకుమార్ తెలిపారు. కొవిడ్-19 అనుమానంతో వచ్చే వారికి తొలి రెండు పరీక్షలు ఉచితం అని వెల్లడించారు. అయితే కరోనా అనుమానిత లక్షణాలు లేనివారికి పరీక్షలు నిర్వహించరని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News