Jagan: ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి రావడం దురదృష్టకరం: సీఎం జగన్​

AP CM Jagan Press meet

  • కరోనా వైరస్ పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలి
  •  ‘పానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదు
  • ‘కరోనా’ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని, ఏపీ ప్రజలు చింతించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. గవర్నర్ హరిచందన్ ని కలిసిన అనంతరం సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వృద్ధులు, డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు, ఇతర వ్యాధులు ఉన్న వారిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు లేనివారు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా వైరస్ పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలని, ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతారని, ఇదొక భయానక పరిస్థితి అని ‘పానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

‘కరోనా’ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలని సూచించారు. ఏపీలో 70 నమూనాలు పరిశీలిస్తే అందులో ఒకరికి మాత్రమే ‘కరోనా’ పాజిటివ్ గా వచ్చిందని అన్నారు. ‘కరోనా’ కేసుల్లో 13.8 శాతం మాత్రమే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాయని, 85 శాతం కేసులకు ఇంటి దగ్గరే చికిత్స జరుగుతోందని, 4.75 శాతం కేసులు మాత్రమే క్రిటికల్ గా ఉన్నాయని అన్నారు.

ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను త్వరలోనే ఆయా దేశాలు వారిని  స్వదేశానికి పంపిస్తాయని, ఈ పక్రియ కొన్ని నెలలపాటు కొనసాగుతుందని, ఇది రెండు, మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు దాదాపు ఏడాదిపాటు కొనసాగుతాయని చెప్పారు.

Jagan
YSRCP
Andhra Pradesh
pressmeet
  • Loading...

More Telugu News