: రఘునందన్ వ్యవహారంపై 'రాములమ్మ' స్పందన


సరైన ఆధారాల్లేకుండా చేసిన ఆరోపణలపై ఏం స్పందిస్తామంటున్నారు మెదక్ ఎంపీ విజయశాంతి. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన రఘునందన్.. ఆ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పద్మాలయా స్టూడియో భూముల వ్యవహారంలో విజయశాంతి ఇంట్లోనే సెటిల్ మెంట్ జరిగిందని, ఈ భాగోతంలో హరీశ్ రావుకు రూ.80 లక్షల ముడుపులు అందాయని రఘునందన్ మీడియా సమావేశంలో బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలపై విజయశాంతి నేడు స్పందించారు.

రఘునందన్ చెప్పినట్టు 48 గంటల గడువు పూర్తయిందని, అయినా అతను ఆధారాలు బయటపెట్టలేకపోయాడని అన్నారు. ఇలా రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం బురద చల్లడం కిందనే భావించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. హుందాగా వ్యవహరించాలని రఘునందన్ కు సూచిస్తూ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీనే అడిగి ఉంటే బావుండేదని, ఇలా వేదికలెక్కి విమర్శలు చేయడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News