Central government employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

DA increase for central government employees
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు  డీఎ పెంపు
  • నాలుగు శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
  • జనవరి 1, 2020 నుంచి వర్తింపు  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు నాలుగు శాతం డీఏ (డియర్ నెస్ అలవెన్స్) పెరిగింది. ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది. డీఏ పెంపు నిర్ణయం జనవరి 1, 2020 నుంచి వర్తిస్తుంది. కేంద్రం నిర్ణయంతో 35 లక్షల మంది ఉద్యోగులకు, 25 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. 
Central government employees
DA
central cabinet

More Telugu News