Tom Hanks: హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ కు సోకిన మహమ్మారి వైరస్!

Tom Hanks Couple Tested Positive Corona Virus
  • ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టామ్
  • జలుబు, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు
  • తన భార్యకు కూడా వైరస్ సోకిందన్న నటుడు
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, అతని భార్య రీటా విల్సన్ లకు ప్రమాదకర కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని టామ్ హాంక్స్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. వీరిద్దరి వయసూ 63 సంవత్సరాలు కాగా, ఇద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం తాము ఐసోలేషన్ వార్డులో ఉన్నామని, వైద్యులు చికిత్సను అందిస్తున్నారని టామ్ హాంక్స్ తెలిపారు.

"కాస్తంత అలసినట్టు అనిపించింది. ఒళ్లు నొప్పులు, జలుబు వచ్చాయి. రీటా పరిస్థితి కూడా ఇంతే. ఆమెకు కాస్తంత జ్వరం కూడా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యే మా ముందుంది. మేము కరోనా పాజిటివ్ అయ్యాము" అని టామ్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల మెడికల్ ప్రొటోకాల్స్ పాటిస్తున్నామని అన్నారు.

కాగా, టామ్ హాంక్స్ పలు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నటించిన ఫారెస్ట్ గంప్, కాస్ట్ ఎవే, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, బిగ్, కెప్టెన్ ఫిలిప్స్, ది గ్రీన్ మైల్, ఫిలడెల్ఫియా, స్లీప్ లెస్ ఇన్ సియాటెల్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, అపోలో 13, ది డావిన్సీ కోడ్ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
Tom Hanks
Rita Wilson
Corona Virus
Positive

More Telugu News