RRR: 'ఆర్ఆర్ఆర్' టైటిల్ పోటీలో అమిత స్పందన పొందిన టైటిల్ ఇదే!

RRR Title Rama Ravana Rajyam

  • టైటిల్ సూచించాలని కోరిన చిత్ర యూనిట్
  • అత్యధికులు 'రామ రావణ రాజ్యం'వైపు మొగ్గు
  • ఇంకా అధికారికంగా ప్రకటించని రాజమౌళి

'ఆర్ఆర్ఆర్'...!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా, మరెంతో మంది ప్రముఖ తారాగణం నటిస్తుండగా, తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయినా, ఇంతవరకూ టైటిల్ ఏమిటన్న విషయమై స్పష్టత లేదు. వచ్చే సంవత్సరం జనవరి 8న సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఇటీవల 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ టైటిల్ కు సరిపోయే మంచి టైటిల్ ను ప్రేక్షకులు సూచించాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక 'రామ రావణ రాజ్యం', 'రఘుపతి రాఘవ రాజారామ్' టైటిల్స్ కు అధిక స్పందన రాగా, అత్యధికులు 'రామ రావణ రాజ్యం' వైపే మొగ్గుచూపారు. ఇక హిందీలో ఈ సినిమాకు 'రామ్ రావణ్ రాజ్' అన్న పేరు పెట్టాలని రాజమౌళి అనుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక 'ఆర్ఆర్ఆర్' అంటే ఇదేనా? అన్నది తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

RRR
Tittle
Rama Ravana Rajyam
  • Loading...

More Telugu News