USA: అమెరికాలో కరోనా కల్లోలం.... 31కి చేరిన మృతుల సంఖ్య

31 People dies in US due to corona virus

  • అమెరికాలో 1000 దాటిన కరోనా బాధితుల సంఖ్య
  • ఒక్క వాషింగ్టన్ లోనే 24 మంది మృత్యువాత
  • జనజీవనంపై కరోనా తీవ్ర ప్రభావం
  • షాపింగ్ మాల్స్, కాలేజీల మూసివేత

చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (కొవిడ్-19) అగ్రరాజ్యం అమెరికాను సైతం కకావికలం చేస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1000 దాటగా, మృతుల సంఖ్య 31కి పెరిగింది. వీరిలో 24 మంది వాషింగ్టన్ నగరంలోనే చనిపోయారు. అమెరికాలో జనవరి 21న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటినుంచి కొన్ని వారాల వ్యవధిలోనే కరోనా విస్తృతమైంది. 38 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం ఉన్నట్టు అధికారవర్గాలు గుర్తించాయి.

ఈ నెల మొదటివారంలో 70గా ఉన్న కేసుల సంఖ్య, కొన్నిరోజుల వ్యవధిలోనే 1000కి చేరడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కరోనా ప్రభావం అధ్యక్ష ఎన్నికలపైనా పడింది. అభ్యర్థులు తమ సభలను వాయిదా వేసుకోకతప్పలేదు. సాధారణ జనజీవనం కూడా మందగించింది. షాపింగ్ మాల్స్ మూసేశారు. కళాశాలల్లో క్లాసులు రద్దు చేశారు.

  • Loading...

More Telugu News