Kiara Advani: మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కైరా అద్వానీ

Kiara Advanis sensational comments on Me Too

  • మీటూ వల్ల పూర్తి ఫలితం రాలేదు
  • పరిస్థితులు మారుతాయని కూడా నేను అనుకోవడం లేదు
  • మీటూ తర్వాతి దశకు మనం చేరుకోలేకపోయాం

'మీటూ' ఉద్యమం భారతీయ సినీ పరిశ్రమను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎందరో నటీమణులు, మహిళా టెక్నీషియన్లు పరిశ్రమలో తాము ఎదుర్కొన్న వేధింపులను నిర్భయంగా వెల్లడించారు. మీటూ ద్వారా సినీ పరిశ్రమలోని ఎందరివో బాగోతాలు బయటపడ్డాయి. మీటూ వల్ల ఇండస్ట్రీకి ఎంతో మేలు జరిగిందని కాజోల్ వంటి నటీమణులు కూడా కితాబిచ్చారు.

అయితే హీరోయిన్ బాలీవుడ్ భామ కైరా అద్వానీ మాత్రం మీటూ వల్ల పూర్తి ఫలితం రాలేదని వ్యాఖ్యానించింది. మీటూ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారుతాయని తాను భావించానని... అయితే ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. మార్పులు వస్తాయని కూడా తాను భావించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ తర్వాతి దశకు మనం చేరుకోలేకపోయామని చెప్పింది. కైరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Kiara Advani
Tollywood
Bollywood
MeToo India
  • Loading...

More Telugu News