Jyotiraditya Scindia: మోదీ, అమిత్ షాలతో సింధియా భేటీ.. ఎంపీలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలినట్టే!

Jyotiraditya Scindia meets Modi and Amit Shah
  • కాంగ్రెస్ పై సింధియా తిరుగుబాటు
  • సింధియా వెనుక 20 మంది ఎమ్మెల్యేలు
  • ఈరోజే బీజేపీలో చేరే అవకాశం
మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి గద్దె దించడానికి రంగం సిద్ధమైంది. కర్ణాటక తరహా రాజకీయాలకు మధ్యప్రదేశ్ లో బీజేపీ తెరతీసింది. సీఎం పదవి తనకు దక్కలేదనే అసంతృప్తిలో ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ విజయవంతంగా తమ వైపు తిప్పుకుంది.

కాసేపటి క్రితం ప్రధాని మోదీతో సింధియా భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరుండి ఆయనను మోదీ వద్దకు తీసుకెళ్లారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజే బీజేపీలో సింధియా చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు రాజీనామా చేస్తే కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.

Jyotiraditya Scindia
Congress
Narendra Modi
Amit Shah
BJP
Madhya Pradesh

More Telugu News