Andhra Pradesh: రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ.. పరిమళ్ నత్వానీకి సీటు!
![YSRCP Rajyasabha candidates from Ap](https://imgd.ap7am.com/thumbnail/tn-897d6b3edcf9.jpg)
- నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు
- మోపిదేవి, పిల్లి సుభాష్, అయోధ్య రామిరెడ్డిలకు సీట్లు
- మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో మోపిదేవి, పిల్లికి దక్కిన అవకాశం
ఏపీ నుంచి తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు, రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డికి, నాల్గో సీటును మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు. కాగా, మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో వీరిని రాజ్యసభకు పంపుతున్నట్టు సమాచారం.