Renuka Chowdary: రేణుకా చౌదరిపై మాధవీలత ఫైర్

Actress Madhavi Latha fires on Renuka Chowdary
  • మోదీని గతి తప్పిన ఏనుగుతో పోల్చిన రేణుక
  • కాంగ్రెస్ ఒక చెత్త పార్టీ అన్న మాధవీలత
  • చెత్తను మోదీ ఊడ్చేస్తారని వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత విమర్శలు గుప్పించారు. ఓ టీవీ చానల్ తో రేణుక మాట్లాడుతూ, ప్రధాని మోదీని గతి తప్పిన ఏనుగుతో పోల్చారు. ఈ వ్యాఖ్యలను మాధవీలత తప్పుపట్టారు. 'మేడమ్... మాకు ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే మేము బ్రిటీష్ కౌంటీలకు చెందినవారము కాదు. ఇండియాలో పుట్టి, ఇక్కడే పెరిగాము. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు పరిపాలించింది. అయినప్పటికీ మన దేశంలోని ప్రజలు ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గుతున్నారు? దీనికి కారణం మీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? దేశంలో ఓ చెత్త బుట్టలాంటి పార్టీ మీది. ఈ చెత్తను మోదీ ఊడ్చేస్తారు. దేశాన్ని స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దుతారు' అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Renuka Chowdary
Congress
Madhavi Latha
BJP
Narendra Modi

More Telugu News