Ajith: 'వాలిమై' కోసం విదేశాలకి అజిత్

Valimai Movie

  • అజిత్ హీరోగా రూపొందుతున్న 'వాలిమై'
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథాకథనాలు
  • ప్రధాన ఆకర్షణగా కనిపించనున్న భారీతనం

అజిత్ తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి వినోద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను 'స్పెయిన్' .. 'మొరాకో'లలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.

అక్కడ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగు రద్దు కావొచ్చుననే ప్రచారం జరుగుతోంది. కానీ ముందుగా అనుకున్న ప్రకారమే ఆయా ప్రాంతాల్లో షూటింగ్ జరపాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ .. మే నెలల్లో అక్కడ షూటింగ్ జరపడానికి సిద్ధమవుతున్నారట. కరోనా కారణంగా సినిమా షూటింగులు వాయిదా వేసుకుంటున్న వేళ, అజిత్ టీమ్ ధైర్యంగా విదేశాలకి వెళ్లనుండటం ఆశ్చర్యకరం.

Ajith
CH. Vinoth
Valimai Movie
KollyWood
  • Loading...

More Telugu News