: అబ్బాయిలు గిటార్ పట్టుకుంటే అమ్మాయిలు ఫ్లాట్
నచ్చిన అమ్మాయి ఫోన్ నంబరు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మాంచి డ్రస్ వేసుకుని చేతిలో గిటారు పుచ్చుకుని స్టైలిష్ గా వెళ్లిపోండి. అమ్మడు ఐస్ అయిపోవాల్సిందే. చేతిలో గిటార్ ఉన్న యువకులనే యువతులు ఎక్కువగా ఇష్టపడతారని యూనివర్సిటీ ఆఫ్ పారిస్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
వీరు చూపులకు చక్కగా ఉన్న ఒక నవయవ్వనుడిని ఎంపిక చేశారు. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న 300 మంది యువతుల దగ్గరుకు అతడిని మూడు అవతరారాల్లో పంపించారు. ఒకసారి జిమ్ బ్యాగ్ తో, ఒకసారి గిటార్ తో, ఒక సారి ఖాళీ చేతులతో ఇలా మూడు రకాలుగా పంపించి చూశారు. మొత్తానికి గిటార్ తో వెళ్లినప్పుడే ఎక్కువ మంది ఆ యువకుడిని చూడడం, మాట్లాడడం, నంబర్ ఇచ్చేయడం జరిగిపోయింది. మిగతా రెండు అవతారాల కంటే గిటార్ తో వెళ్లినప్పుడు మంచిగా వర్కవుట్ అయిందని తెల్చారు. అదీ సంగతి!