Arasavelli: 9 నిమిషాల పాటు ఆదిత్యుని తాకిన సూర్య కిరణాలు... పులకించిన భక్తజనం!

Sun Rays On Sun God

  • 6. 21 నుంచి 6.30 గంటల వరకూ అద్భుతం
  • 9 నిమిషాల పాటు తాకిన కిరణాలు
  • గత రాత్రి నుంచే బారులు తీరిన భక్తులు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వేంచేసివున్న సూర్య నారాయణ స్వామి ఆలయంలో నేడు జరిగిన అద్భుతాన్ని కొన్ని వేల మంది తిలకించి, పులకించారు. ఈ ఉదయం సూర్యోదయ శుభవేళ, స్వామిని సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6.21 గంటల నుంచి 6.30 గంటల వరకూ తొమ్మిది నిమిషాల పాటు ఆదిత్యునిపై సూర్య కిరణాల ప్రసారం భక్తులను కనువిందు చేసింది. ప్రతి సంవత్సరమూ మార్చి 9, 10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారిపై నేరుగా పడతాయన్న సంగతి తెలిసిందే. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ఇది జరుగుతుంది. ఆపై అక్టోబర్ 1, 2 తేదీల్లోనూ ఇదే అద్భుతం గోచరిస్తుంది. దీన్ని తిలకించేందుకు గత రాత్రి నుంచే భక్తులు బారులు తీరారు.

Arasavelli
Sun
Temple
Sun Rays
  • Loading...

More Telugu News