Kerala: కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి 'కరోనా'.. దేశంలో 39కి చేరిన కేసులు

 Kerala Health Minister KK Shailaja on corona

  • ప్రకటన చేసిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ 
  • వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది
  • వారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స 
  • వారిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారు

కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ అని తేలిన వారి సంఖ్య 39కి చేరింది. కేరళలో కొన్ని రోజుల క్రితం ముగ్గురికి కరోనా సోకగా వారు ఆసుపత్రుల్లో కోలుకుంటున్న విషయం తెలిసిందే. 

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... 'మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తేలింది. వారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారు. పథనంతిట్ట జిల్లాలోని తమ ఇంటికి చేరుకున్నాక వారి ఇంట్లోని మరో ఇద్దరికి సోకింది' అని ఆమె ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News