marutirao: 'అమృతా.. అమ్మ దగ్గరికి వెళ్లమ్మా' అంటూ మారుతీ రావు ఆత్మహత్య లేఖ

maruti rao suicide note

  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు
  • ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు
  • ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

'గిరిజా నన్ను క్షమించు.. అమృతా అమ్మదగ్గరికి వెళ్లమ్మా' అంటూ మారుతీరావు ఆత్మహత్య లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణయ్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు రాసినట్లు ఉన్న ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు.

marutirao
amrita
Hyderabad
Police
  • Loading...

More Telugu News