Bengaluru: డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. దానిని ఢీకొట్టిన మరో కారు.. 13 మంది దుర్మరణం

Two cars collided in Karnataka 13 people dead
  • బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం
  • అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు
  • బోల్తాపడిన కారును ఢీకొన్న మరోకారు
బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బైలాదాకెరె వద్ద ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న మరో కారు బోల్తా పడిన కారును ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జయ్యాయి. రెండు కార్లలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Bengaluru
mangalore
Road Accident
Karnataka

More Telugu News