KCR: తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చిన పొత్తూరి: కేసీఆర్‌

we lost a degnetary in journalism say kcr

  • పత్రిక, సామాజిక రంగాల్లో ఆయనది చిరస్మరణీయ పాత్ర
  • ఓ మంచి పాత్రికేయుడిని కోల్పోయాం
  • ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

ప్రముఖ పాత్రికేయుడు, ఉమ్మడి ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి ఎంతో సహకరించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ విజయ్‌నగర్‌ కాలనీలో పొత్తూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్‌ ఉద్యమం నాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పత్రిక, సేవా రంగాల్లో పొత్తూరి సేవలు చిరస్మరణీయమని, ఓ మంచి పాత్రికేయుడిని కోల్పోయామని అన్నారు.

KCR
Potturi venkteswararao
condolence
  • Loading...

More Telugu News