Ram: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Hebba Patel dances with Ram for Red flick

  • రామ్ తో డ్యాన్స్ చేస్తున్న ముద్దుగుమ్మ 
  • రికార్డు స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సీడెడ్ బిజినెస్ 
  • తెలుగులో చేయనంటున్న బాలీవుడ్ భామ

 *  రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'రెడ్' చిత్రంలో అందాలభామ హెబ్బా పటేల్ కూడా నటిస్తోంది. ఒక ప్రత్యేక పాటలో హెబ్బా కనిపిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ పాటను రామ్, హెబ్బా జంటపై రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే పలు ఏరియాలలో అత్యధిక ధరకు బిజినెస్ జరుపుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం సీడెడ్ హక్కులు తాజాగా 35 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. ఈ ప్రాంతంలో ఇది ఓ రికార్డనే చెప్పాలి.
*  ఇటీవల ప్రభాస్ తో చేసిన 'సాహో' సినిమా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపడం లేదట. తెలుగు నుంచి మంచి పారితోషికం ఆఫర్ చేస్తూ పలు ఆఫర్లు వెళుతున్నప్పటికీ అమ్మడు చేయనని చెబుతోందట.

Ram
Hebba Patel
Rajamouli
Junior NTR
Ramcharan
  • Loading...

More Telugu News